ముంబై: దేశంలో దాదాపు వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ప్రసిద్ధ లాల్ బాగ్చా రాజా గణపతి కి భారీ ఎత్తున నగదు, బంగారు కానుకలు అందాయి.
గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా లాల్ బాగ్చా గణేశుదికి ఏకంగా రూ.5.65 కోట్ల నగదు, మరియు 4.15 కిలోల బంగారంతో పాటు 64 కిలోల వెండి, మరియు ఇతర రకమైన వస్తువులు కానుకల రూపంలో భక్తులు సమర్పించుకున్నారు.
ఈ విషయాన్ని తాజాగా లాల్ బాగ్చా రాజా ఉత్సవ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా స్వామికి వచ్చిన చిన్న చిన్న కానుకలను త్వరలో వేలం వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దేశం మొత్తం మీద ప్రఖ్యాతి గాంచిన ముంబైలోని లాల్ బాగ్చా రాజా గణేశుడిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు.
ఇక్కడకు సామాన్య భక్తులు మొదలు సిన్మా మరియు రాజకీయ, వ్యాపార ప్రముఖులు వచ్చి గణేశుని ఆశీర్వాదం తీసుకుని స్వామికి అనేక కానుకలు కూడా సమర్పిస్తారు.