ముంబై: దేశంలో స్కూటర్ విభాగంలో ప్రాచుర్యం పొందిన హోండా యాక్టివా, ఇప్పుడు పండుగ సమయంలో మరో కొత్త రూపంలో పవర్‌ని పరిచయం చేసి కొత్త కబురు చెప్పేందుకు రెడీ అయ్యింది. హోండా నుండి వచ్చిన సక్సెస్ ఫుల్ మోడల్ యాక్టివాతో పాటు డియో నుంచి కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు మార్కెట్లోకి తీసుకురాబోతోంది.
హోండా మోటార్ సైకిల్ స్కూటర్ ఇండియా నుండీ ప్రవేశపెట్టబోతున్న సరికొత్త మోడళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఢిల్లీలోని ఆర్టీఏ కార్యాలయాణికి సమర్పించింది. వాటిలో పేర్కొన్న వివరాల ప్రకారం హోండా యాక్టివా 6జీ మోడల్‌తో పాటు డియోలో కూడా కొత్త మోడల్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. కాగా ఈ కొత్త మోడల్స్ రాబోయే పండగ సీజన్లోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హోండా యాక్టివాకు సంబంధించి తాజాగా 6జీ వెర్షన్‌ను తెచ్చేందుకు హోండా సిద్ధమైంది. హోండా 6జీ, హోండా 6జీ ఎల్ఈడీ వెర్షన్లలో రెండు స్కూటర్లు మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం హోండా యాక్టివాకు స్టీల్ వీల్స్ ఉండగా 6జీ నుంచి ఎల్లాయ్ వీల్స్‌ని పరిచయం చేయనుంది.
హోండా 6జీ యాక్టివా, డియో మోడల్స్ రెండింటిలోనూ ఇంజన్ సామర్థ్యం 109.51 సీసీ సింగిల్ సిలిండర్‌గా ఉండనున్నట్లు సమాచారం. యాక్టివా 5జీ 7.68 హెచ్పీతో 8,000 ఆర్పీఎం శక్తిని విడుదల చేయనుంది. ఇక డియోకు సంబంధించి 7.65 హెచ్పీతో 8,000 ఆర్‌పీఎంని రిలీజ్ అవనున్నాయి.