మూవీడెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయెల్ నటిస్తున్నారు.
ఇటీవల అఫీషియల్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా సినిమా కథపై కొన్ని సూచనలు వచ్చాయి.
ప్రత్యేకంగా కోల్‌కతా హవ్‌రా బ్రిడ్జ్, సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్, చార్మినార్ వంటివి కనిపించడంతో సినిమా 1940ల వార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని క్లారిటీ వచ్చింది.
ఇక కథపై రకరకాల రూమర్లు కూడా వినిపించాయి. నానికి చేయాలనుకున్న కథను ప్రభాస్‌కి మార్చారని, రెండు కథలు ఒకే విధంగా ఉన్నాయని చర్చలు జరిగాయి.
అయితే దర్శకుడు హనురాఘవపూడి ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. నానికి నెరేట్ చేసిన కథ, ప్రభాస్‌కి చేస్తున్న కథ పూర్తిగా వేర్వేరు అని స్పష్టం చేశారు.
తాను అనేక వార్ బేస్డ్ కథలు రాసుకున్నానని, ఇవి ఒకే కథలు కాదని తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.
ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రత్యేకంగా ఈ చిత్రం 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుండటం, భారీ సెట్‌లతో సినిమాను రూపొందిస్తుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.