fbpx
Thursday, March 28, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsసత్యదేవ్ హబీబ్: కొడుకుని వెతికే తండ్రి కథ

సత్యదేవ్ హబీబ్: కొడుకుని వెతికే తండ్రి కథ

Habeeb Song Release

టాలీవుడ్: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ సత్యదేవ్ కెరీర్ తొలినాళ్లలో ఒక సినిమాలో నటించాడు. ఈ సినిమా ఆఫ్ఘనిస్తాన్ లో షూటింగ్ చేసారు. ఆ షూటింగ్ లో జరిగిన ఇబ్బందుల్ని ఎన్నో ఇంటర్వూస్ లో సత్యదేవ్ తెలిపారు. ఇంకా షూటింగ్ పూర్తి కానీ ఈ సినిమాలోని ఒక పాటని ఈ రోజు విడుదల చేసారు. ‘హబీబ్’ అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమాలోని ఒక పాట ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసారు.

ఈ పాటలో కొడుకుని వెతుక్కుంటూ వెళ్లే తండ్రి పాత్రలో సత్యదేవ్ కనిపిస్తాడు. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అయిన సత్యదేవ్ కి ఒక ఒక కుమారుడు ఉంటాడు. ఆ కొడుకు చైల్డ్ మిలిటెంట్ ట్రైనింగ్ పరంగా బోర్డర్ దాటి పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాడు. దాదాపు 8 నిమిషాల కన్నా ఎక్కువగానే ఉన్న ఈ పాటలో సత్యదేవ్ తన కొడుకు కోసం చేసే జర్నీ ని చూపిస్తారు. చివరకి తన కొడుకు తో పాటు ఆలా అక్కడికి పంపబడిన మెగా పిల్లల్ని కూడా కాపాడే ‘హబీబ్’ అనే పాత్రలో సత్యదేవ్ ఈ సినిమాలో నటించాడు.

ఈ సినిమాని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఇది తెలుగులో కాకుండా బాలీవుడ్ లో రూపొందుతుంది. జన్నిఫెర్ ఆల్ఫోన్స్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. హబీబ్ సాఫి మరియు కోటి రావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular