ముంబై: కొత్తగా బంగారం కొనాలనుకునే వారికి ఒక అదిరిపోయే శుభవార్త. కేవలం కేవలం ఒకే ఒక్క రోజులో బంగారం ధర రూ.400కి పైగా తగ్గింది. రాబోయే సంవత్సరం లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తన నెలవారీ బాండ్ కొనుగోళ్లను సడలించిబోతునట్లు ప్రకటించిన తరువాత భారతదేశంలో బంగారం ధర భారీగా నేల చూసింది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఇవాళ బంగారం ధర 0.62 శాతం క్షీణించి రూ.46,383కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ ఫెడ్ ఊహించిన దానికంటే త్వరగా వడ్డీ రేటు పెంపును ప్రకటించడంతో బంగారం ధర భారీగా పడిపోయింది.
ఇండియన్ బులియన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం దాదాపు రూ.400లు తగ్గడంతో ఇప్పుడు ధర రూ.46,468కి చేరింది. అలాగే ఆర్నమెంట్ 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,934 నుంచి రూ.42,565కు దిగి వచ్చింది. ఇంకోవైపు, వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి.
ఒక కిలో వెండి ధర రూ.600లు తగ్గడంతో ప్రస్తుతం ధర రూ.60,362కి చేరింది. నిన్నటి ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.60,954లుగా ఉంది. కాగా హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర దాదాపు రూ.47,840ల నుంచి రూ.47,560కు పడిపోయింది.