మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగర శివార్లలో ఆదాయ పన్ను శాఖ (ఐటీ), లోకాయుక్త సంయుక్త దాడుల్లో 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల నగదు కలకలం సృష్టించాయి.
మెండోరీ ప్రాంతంలో ఓ ఇన్నోవా కారును సస్పెక్ట్‌గా గుర్తించిన అధికారులు, భారీ బందోబస్తు మధ్య తనిఖీ చేసి ఈ అమూల్య వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కారు గ్వాలియర్‌కు చెందిన చేతన్ గౌర్, మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మలకు చెందినదిగా గుర్తించారు. గతంలో సౌరభ్ శర్మ ఆర్టీవో ఆఫీసులో పనిచేసిన అనుభవం ఉంది.
ఐటీ దాడుల్లో ఆయన నివాసంలోనూ రూ.1 కోటి నగదు, అరకిలో బంగారం, వజ్రాలు, వెండి కడ్డీలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
అడవిలో వదిలిన కారులో దొరికిన నగదు, బంగారాన్ని శర్మకు చెందినదిగా అధికారులు అనుమానిస్తున్నారు.
అయితే ఇప్పటివరకు ఆస్తులు తమవని ఎవరూ ముందుకు రాలేదు. బంగారం, నగదుపై పూర్తి వివరాలు సేకరించేందుకు అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటన భోపాల్‌లో చర్చనీయాంశమైంది.