fbpx
Tuesday, April 23, 2024
HomeMovie Newsజార్జ్ రెడ్డి నటుడు హీరో గా 'గంధర్వ'

జార్జ్ రెడ్డి నటుడు హీరో గా ‘గంధర్వ’

GeorgeReddy Actor GandharvaMovie

టాలీవుడ్: రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘వంగవీటి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ మాధవ్. జార్జ్ రెడ్డి సినిమాతో ఇంకొంచెం పాపులర్ అయ్యాడు. ఈ సినిమాతో యాక్టింగ్, యాక్షన్ పరంగా ఆకట్టుకున్నాడు సందీప్. ప్రస్తుతం ఈ నటుడు హీరోగా ‘గంధర్వ’ అనే సినిమా మొదలయ్యింది. ఈ సినిమాకి సంబందించిన మోషన్ పోస్టర్ ఒకటి విడుదల చేసింది సినిమా టీం. పోస్టర్ చూస్తుంటే ఇది ఒక పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్ధం అవుతుంది.

జార్జి రెడ్డి సినిమాలో యాక్షన్ ఎంటర్టైనర్ గా నిరూపించుకున్న సందీప్ మాధవ్ మరో సారి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో మెప్పించనున్నాడు. సినిమా ఫస్ట్ లుక్ లో కూడా ఒక యాక్షన్ కి సంబందించిన లుక్ ని విడుదల చేసారు. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎం.ఎన్ మధు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాప్ రాక్ షకీల్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అప్సర్ అనే దర్శకుడు ఈ సినిమాకి కథ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం చేస్తున్నారు. అత్తో త్వరలో షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular