fbpx
HomeMovie News'గాలి సంపత్' ట్రైలర్ విడుదల

‘గాలి సంపత్’ ట్రైలర్ విడుదల

GaaliSampath Trailer Released

టాలీవుడ్: శ్రీ విష్ణు హీరోగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ‘గాలి సంపత్’. ఈ సినిమాలో గాలి సంపత్ టైటిల్ రోల్ లో రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నాడు. శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ తండ్రి కొడుకుల పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో మాటలు సరిగ్గా రాని పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించాడు. మాటలు రాని పాత్రలో ‘ఫే ఫాఫా ‘ అంటూ రాజేంద్ర ప్రసాద్ చేసే కామెడీ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఒక తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ బేస్ చేసుకుని ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది.

సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో ఈ సినిమా రూపొందింది. షైన్ స్క్రీన్స్ మరియు ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సాహు గారపాటి , హరీష్ పెద్ది , ఎస్. క్రిష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ‘అలా ఎలా’ సినిమాని డైరెక్ట్ చేసిన అనీష్ కృష్ణ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. శివరాత్రి కానుకగా మార్చ్ 11 న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular