మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ అభిమానుల్లో చాలా రోజులుగా ఆసక్తిని రేపుతున్నాడు.
చాలా కాలంగా ఆయన సినీ అరంగేట్రంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ, ఇప్పుడు మాత్రం ఆ వార్తలు నిజం కానున్నాయి.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా ప్రారంభం కానుందని తాజా సమాచారం. మోక్షజ్ఞకి సంబంధించిన తొలి సినిమా సూపర్ హీరో జానర్ లో ఉంటుందని ప్రచారం సాగుతోంది.
గతంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హీరో సినిమాలు మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో, మోక్షజ్ఞ కోసం కూడా అదే విధమైన శక్తివంతమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఆయన SLV బ్యానర్ ద్వారా ఈ భారీ ప్రాజెక్టును నిర్మించడానికి ముందుకు వచ్చారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, సెప్టెంబర్ 6న ఈ సినిమాకి లాంచ్ వేడుక రామకృష్ణ స్టూడియోస్‌లో జరగనుందనే టాక్ వినిపిస్తోంది.
నందమూరి అభిమానులు ఎప్పటినుంచో మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై ఆసక్తిగా ఉన్నారు.
బాలకృష్ణ తనయుడిగా, ఎన్టీఆర్ తమ్ముడిగా వస్తున్న మోక్షజ్ఞ పాన్ ఇండియా రేంజ్ లో మొదటి సినిమాతోనే ప్రభావం చూపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.