fbpx
Saturday, April 20, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeLife Styleడ్రీమ్‌-11 ఊహించని లాభాల ఆర్జన!

డ్రీమ్‌-11 ఊహించని లాభాల ఆర్జన!

DREAM11-GAINS-180CRORES-PROFIT-IN-2020FY

ముంబై: ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్-11 లాభాలను ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో డ్రీం-11 ఏకంగా రూ.180 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. భారత్‌లో డ్రీమ్‌-11 ఫాంటసీ గేమింగ్‌ విభాగంలో యూనికార్న్‌ సంస్థగా నిలిచింది. కాగా డ్రీం-11 2019-20 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.87 కోట్ల నష్టాలను చవిచూసింది.

కాగా డ్రీమ్‌-11 సంస్థ నిర్వహిస్తున్న స్పోర్ట్టా టెక్నాలజీస్‌ ఈ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2.5 రెట్ల గణనీయ వృద్ధిని నమోదు చేసింది. 2019లో డ్రీమ్‌-11 ఆదాయం సుమారు రూ. 775.5 కోట్ల నుంచి 2020లో రూ. 2,070 కోట్ల వరకు ఎగిసింది. తమ కంపెనీ ఈ రేంజ్‌లో ఆదాయ అభివృద్దికి వినూత్న మార్కెటింగ్ వ్యూహాలు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది.

డ్రీమ్‌ స్పోర్ట్స్‌ అడ్వర్‌టైజింగ్‌పై దృష్టి సారిస్తూ సుమారు ఈ ఏడాదిలో సుమారు రూ.1,328 కోట్లను ఖర్చు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.785 కోట్లను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. డ్రీమ్‌-11ను 2008లో జైన్, భవిత్ శేత్‌తో కలిసి ఏర్పాటుచేశారు. డ్రీమ్ 11 సుమారు 9 కోట్లపైగా కస్టమర్లను కలిగి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular