మూవీడెస్క్: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర ట్రైలర్ ఫైనల్ గా వచ్చేసింది.
దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను చాలా విన్నూత్నంగా తీర్చిదిద్దారని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.
రెండు విభిన్నమైన పాత్రలలో ఎన్టీఆర్ కనిపిస్తారని ఇదివరకే ఊహించగా, ఇప్పుడు ట్రైలర్ ద్వారా ఆ విషయంలో అసలు క్లారిటీ వచ్చేసింది.
ట్రైలర్ ప్రారంభం నుంచే ఎన్టీఆర్ పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. మాస్ ఆడియన్స్ కోసం డిజైన్ చేసిన యాక్షన్ సీన్లు ట్రైలర్‌లో హైలైట్ అయ్యాయి.
ముఖ్యంగా ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉండగా, ఆయన పోషించిన దేవర పాత్ర చాలా వైలెంట్ గా ఉంటుందని కనిపిస్తోంది.
ఈ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అనిపిస్తోంది. ఇక జాన్వి పాత్ర కూడా ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తోంది.
పల్లెటూరి అమ్మాయిగా ఆమె పాత్రను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. సైఫ్ అలీఖాన్ రాక్షసత్వాన్ని కూడా గట్టిగానే చూపించనున్నట్లు అర్ధమవుతుంది.
ట్రైలర్ చివరలో ఎన్టీఆర్ సొరచేపతో సవారీ చేస్తూ కనిపించిన సీన్ అభిమానులకు నిజంగా మరచిపోలేని దృశ్యం. ఈ సీన్ సినిమా స్థాయిని మరింత పెంచుతుంది.
ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉండబోతున్నాయని అనిపిస్తోంది. ఇక సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రల్లో ఎలా మెప్పిస్తారో చూడాలి.