మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా డాకూ మహారాజ్ సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో మరో మెమోరబుల్ మూవీగా నిలుస్తుందని భావిస్తున్నారు.
ఈ సినిమాను ఒక నిజ జీవిత బందిపోటు కథ ఆధారంగా రూపొందించారు. ఊర్వశీ రౌతేలా, చాందిని చౌదరి, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలతో, థియేటర్లలో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి బాబీ ప్రత్యేకంగా పని చేసినట్లు సమాచారం.
‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాబీ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం కావడం విశేషం.
ఇదిలా ఉంటే, చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను అమరావతిలో నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తోంది.
ఏపీ రాజధాని అమరావతిని మరింతగా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వంటి ప్రముఖులను ఆహ్వానించవచ్చనే టాక్ నడుస్తోంది.
బాలయ్య ప్రస్తుతం టీడీపీకి చెందిన ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో, ఈ ఈవెంట్ ఏపీ పాలిటిక్స్‌లో కూడా చర్చనీయాంశమవుతోంది.
ఒకవేళ పవన్, చంద్రబాబు, బాలయ్య ఒకే వేదికపై కనిపిస్తే, అది సినిమాకు అదనపు క్రేజ్‌ను తీసుకురావడం ఖాయం.
ప్రస్తుతం డాకూ మహారాజ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్‌ను ప్రకటించనున్నారు.