న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 60,963 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 834 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తంగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,29,638కి చేరుకుంది.
ఇప్పటి వరకు 46,091 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 56,110 మంది కరోనా నుండి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 16,39,599 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.
కాగా, ఇప్పుడు దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం కేవలం 27.64గా ఉంది. ప్రస్తుతం రికవరీ రేటు 70.38 శాతం ఉండగా, మరణాల రేటు 1.98 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో 7,33,449 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,60,15,297 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.