తిరుపతి: చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ని తిరుపతి పోలీసులు శనివారం బెంగళూరులో అరెస్ట్ చేశారు.
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని, వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు పోటీ చేశారు.
కాగా, పోలింగ్ అనంతరం తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించడానికి వచ్చిన సమయంలో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై కొందరు దాడి చేశారు.
దీని వల్ల, ఈ ఘటనపై హత్యాయత్నం సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, కేసు విచారణ వాయిదా పడింది.
తిరుపతి పోలీసులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసి రాష్ట్రానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి ఈ కేసులో 37వ నిందితుడిగా ఉన్నారు.