మూవీడెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఇటీవల నాగార్జున నివాసంలో సింపుల్‌గా జరిగిన విషయం తెలిసిందే.
ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు మరియు కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.
వారి ఎంగేజ్మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఇప్పుడు వారి వివాహంపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, నాగ చైతన్య మరియు శోభిత వచ్చే ఏడాది మార్చిలో రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు ఇండస్ట్రీలో టాక్.
ఈ వివాహ వేడుక చాలా సింపుల్‌గా, ట్రెడిషనల్‌గా ఉండబోతుందని, కేవలం దగ్గరి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది.
అందరూ చర్చిస్తున్న ఒక విషయం అంటే చై, శోభిత మధ్య ఉన్న వయస్సు తేడా. చైతన్య 1986లో జన్మించగా, శోభిత 1992లో పుట్టింది.
దీంతో వీరిద్దరి మధ్య ఆరు సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది.
ఇక ఇప్పటివరకు ఈ వివాహంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా, సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
పెళ్లి వేడుక ట్రెడిషనల్ పద్ధతిలో, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.