స్పోర్ట్స్ డెస్క్: చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ అభిమానులను మంత్ర్ముగ్దులను చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై కీలక దశలో హ్యాట్రిక్ సాధిస్తూ మ్యాచ్‌కు మలుపు తిప్పాడు. ఇది చాహల్‌కు ఐపీఎల్‌లో రెండో హ్యాట్రిక్ కావడం విశేషం.
చెన్నై 200 పరుగుల మార్కు దిశగా దూసుకెళ్తున్న తరుణంలో, చాహల్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి కట్టడి చేశాడు. ఒకే ఓవర్‌లో దీపక్ హుడా (2), అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్‌ను పూర్తిచేశాడు.
ఈ స్పెల్ వల్ల చెన్నై స్కోరు 190 పరుగులకే పరిమితమైంది. చాహల్ బౌలింగ్‌ను లోయర్ ఆర్డర్ పూర్తిగా సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. దీంతో పంజాబ్ విజయం దిశగా ముందడుగు వేసింది.
ఇది చాహల్ ఐపీఎల్ కెరీర్‌లో రెండో హ్యాట్రిక్. 2022లో రాజస్థాన్ తరఫున కోల్‌కతా పై శ్రేయస్ అయ్యర్, పాట్ కమిన్స్, శివమ్ మావిలను ఔట్ చేసి తన తొలి హ్యాట్రిక్ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించిన అరుదైన బౌలర్‌గా చాహల్ పేరు లిఖించబడింది.