బిజినెస్: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్స్‌తో.. జియో, ఎయిర్‌టెల్‌కి షాక్!
రిలయన్స్ జియో టెలికాం రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుండి మార్కెట్‌లో పెనుమార్పులు వచ్చాయి. అంబానీ తీసుకువచ్చిన పోటీతో అనేక టెలికాం సంస్థలు తెరమరుగై పోయాయి.
2జీ స్కాం వంటి సమస్యలు వెలుగులోకి రావటం, ప్రభుత్వ నిర్లిప్తత కారణంగా బీఎస్ఎన్ఎల్ టెక్నాలజీ పరంగా వెనుకపడిపోయింది.
కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నా సంకేతాలు అందుతున్నాయి. జియోను ఎదుర్కోవడానికి ప్రైవేట్ టెలికాం దిగ్గజాలు ఎయిర్‌టెల్, వీఐ పోటీ పెంచుతుండగా, బీఎస్ఎన్ఎల్ ఊహించని ప్లాన్లతో కస్టమర్లను ఆకర్షించడానికి ప్లాన్లను సిద్ధం చేస్తోంది.
విస్తృత కస్టమర్ బేస్ ఆకర్షణ
జియో అంబానీ వివాహ సందర్భంలో టారిఫ్ రేట్లు పెంచడంతో, చాలా మంది యూజర్లు తిరిగి బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని యూజర్లను ఆకట్టుకునేలా తన కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. తాజాగా బీఎస్ఎన్ఎల్ 54 రోజుల వ్యాలిడిటీతో కేవలం రూ. 347కే సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది.
ఈ ప్లాన్ కింద యూజర్లకు 54 రోజుల పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు, రోజుకు 3జీబీ డేటాతో పాటు అదనంగా 3జీబీ డేటా కలిపి మొత్తం 165 జీబీ డేటా అందజేయనుంది. ఇతర ప్రైవేట్ ఆపరేటర్లు ఇలాంటి ప్లాన్ ఇవ్వకపోవడంతో, ఈ ప్లాన్ కు ఇప్పుడు భారీగా డిమాండ్ వస్తోంది.
ఇన్‌ఫ్రా విస్తరణలో వేగం
బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరిచేందుకు వేగంగా ముందుకు పావులు కదుపుతోంది. టాటా సంస్థల సాయంతో బీఎస్ఎన్ఎల్ కొత్త టవర్లను ఏర్పాటు చేస్తూ, కనెక్టివిటీని మెరుగుపరుస్తోంది. త్వరలోనే సూపర్ ఫాస్ట్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచనలో ఉంది. ఇక 5జీ సేవల కోసం కూడా బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది.
ట్రాయ్ కొత్త నిబంధనలు!
ఇక సిమ్ కార్డ్ నిబంధనల్లో కూడా పెద్ద మార్పులు రాబోతున్నాయి. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మార్గదర్శకాల ప్రకారం, సిమ్ కార్డుల కోసం ఈ-కెవైసీ, సెల్ఫ్ కెవైసీ విధానాలు అమలులోకి రానున్నాయి. తద్వారా సులభంగా ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌గా మారడానికి, సిమ్ కార్డు పొందడానికి ఓటీపీ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి రాబోతోంది.