fbpx
Friday, April 19, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeBig Storyబీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌పై బాంబు దాడి!

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌పై బాంబు దాడి!

BOMB-ATTACK-ON-NITISHKUMAR

పాట్నా: మంగళవారం బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై బాంబు దాడి జరిగింది. నలందలో ఆయన పాల్గొన్న జనసభలో ఒక దుండగుడు బాంబును విసిరాడు. ఈ ఘటనతో అక్కడ ఉన్న అందరూ ఉలిక్కిపడ్డారు.

కాగా సభ జరుగుతున్న వేదికకు దాదాపు పదిహేను నుండి 18 అడుగుల దూరంలో బాంబు కిందపడి పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కాగా స్వల్ప తీవ్రతతో కూడిన ఈ పేలుడు వల్ల ఎవరికీ ఏమీ కాలేదని సమాచారం. నలంద సిలావో గాంధీ హైస్కూల్‌ దగ్గర ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా పాట్నా భక్తియార్‌పూర్‌లో ఈ మధ్యే బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై ఒకసారి దాడి జరిగిన సంగతి తెలిసిందే. మానసిక స్థితి సరిగా లేని స్థానిక నివాసిగా భావిస్తున్న దుండగుడిని వెంటనే పోలీసులు అరెస్టు కూడా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular