యూఎస్: కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేలిఫోర్నియాలోని శాక్రమెంటోలో అతడిని గత గురువారం అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ అరెస్టుపై రకరకాల కథనాలు వైరల్ కాగా దీనిపై అమెరికా సరైన క్లారిటీ ఇచ్చింది. అన్మోల్‌ను అక్రమ పత్రాలతో అమెరికాలోకి ప్రవేశించాడనే ఆరోపణలతో అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.
అన్మోల్ బిష్ణోయ్ భారత నేర చరిత్రలో ప్రధాన పాత్రధారుల్లో ఒకడిగా ఉన్నాడు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో పాటు పలు హైప్రొఫైల్ హత్యల కేసుల్లో అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యకు ఈ గ్యాంగ్ సంబంధం ఉందని భారత పోలీసులు గుర్తించారు. అన్మోల్ కోసం భారత్ ఇంటర్‌పోల్ నోటీసు జారీ చేసి, అమెరికా నుంచి అతడిని అప్పగించాలని అనేక సార్లు కోరింది.
అయితే, అన్మోల్ అరెస్ట్ వెనుక భారత నేరాల కారణం కాదని, అక్రమ పత్రాల వినియోగం కారణంగా అతడిని అదుపులోకి తీసుకున్నట్టు అమెరికా అధికారులు స్పష్టంచేశారు. ఈ అరెస్ట్ విషయం భారత్‌కు సమాచారం అందించారు.
ప్రస్తుతం అన్మోల్ బిష్ణోయ్ అయోవాలోని పొట్టవాట్టమీ కౌంటీ జైలులో ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. భారత ప్రభుత్వం అన్మోల్‌ను అప్పగించాలంటూ అమెరికాను అభ్యర్థించినప్పటికీ, ప్రస్తుతం అతడిని అప్పగించే యోచన లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
నేరాల్లో అతడి ప్రమేయంపై విచారణ కొనసాగుతుండగా, అన్మోల్‌ను భారత్‌కు అప్పగించాలన్న భారత ప్రభుత్వ ప్రయత్నాలు కఠినంగా మారాయి. ఈ అరెస్ట్ భారత్-అమెరికా సంబంధాల్లో కీలక మలుపుగా మారింది.