fbpx
Thursday, April 18, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsఐశ్వర్య రాజేష్ 'భూమిక' ట్రైలర్

ఐశ్వర్య రాజేష్ ‘భూమిక’ ట్రైలర్

Bhoomika Trailer Release

కోలీవుడ్: ‘శైలజా కృష్ణ మూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లోని సువర్ణ పాత్రలతో తెలుగు వారికి పరిచయం అయిన నటి ఐశ్వర్య రాజేష్. తమిళ్ లో వార్సుపైగా కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తున్న ఈ నటి ఈ మధ్య వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది. ఈ మధ్యనే సోనీ లైవ్ ఓటీటీ లో ‘తిట్టమ్ ఇరండు’ అనే థ్రిల్లర్ సినిమాతో హిట్ అందుకుంది ఐశ్వర్య రేజేష్. ప్రస్తుతం ఈ నటి మరో సినిమాతో రానుంది. ‘భూమిక’ అనే టైటిల్ తో రానున్న ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదలైంది. ఒక ఎకో థ్రిల్లర్ కాన్సెప్ట్ గా ఈ సినిమా రూపొందింది.

ఇన్ని ఏళ్లుగా ప్రకృతి ని మీరు చెడగొట్టారు. ప్రకృతి కి తనని తాను కాపాడుకోవడం ఎలానో తెలుసు. కానీ ఒక్క సారి ప్రకృతి , వికృత రూపం దాలిస్తే ఎలా ఉంటుందో చూడలేరు అన్న కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందించినట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, పాషన్ స్టూడియోస్ బ్యానర్స్ పై కార్తీక్ సుబ్బరాజ్ సమర్పణలో కార్తికేయన్ సంతానం, సుధ సుందరం, జయ రామం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రతీంద్రన్ ఆర్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అతి త్వరలో విడుదల అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular