fbpx
Tuesday, April 23, 2024
HomeMovie News'స్టువర్టుపురం దొంగ' గా రానున్న బెల్లంకొండ హీరో

‘స్టువర్టుపురం దొంగ’ గా రానున్న బెల్లంకొండ హీరో

BellamKondaSrinivas NewMovie Launch

టాలీవుడ్: ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా పరిచయం అయిన బెల్లం కొండ శ్రీనివాస్ ప్రతీ సినిమా భారీ స్కేల్ సినిమాల్లో నటిస్తూ మాస్ హీరోగా అవతరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగు తో పాటు బాలీవుడ్ లో కూడా హీరోగా ‘ఛత్రపతి’ రీమేక్ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘స్టువర్టుపురం దొంగ’ అనే సినిమాలో నటించబోతున్నట్టు ప్రకటించాడు. 90 ల్లో స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ అనే సినిమాలో చిరంజీవి హీరో గా నటించాడు. అప్పట్లో ఆంధ్రా లోని ఆ ప్రాతంలో దొంగలు ఎక్కువగా ఉండేవారని ప్రసిద్ధి. ఈ సినిమా కూడా ఒక పీరియాడిక్ కథగా రానున్నట్టు తెలుస్తుంది.

స్టువర్టుపురం లో దొంగగా ఉన్న టైగర్ నాగేశ్వర రావు బయో పిక్ గా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఈరోజు అధికారిక ప్రకటనతో ఆ రూమర్స్ అన్నిటికి తెరదించినట్టయింది. ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత బెల్లం కొండ శ్రీనివాస్ హోమ్ బ్యానర్ లో నటిస్తున్నాడు. శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణి శర్మ సంగీతం అందిస్తున్నాడు. VV వినాయక్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన KS ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవనున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవనున్నట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular