fbpx
Monday, September 9, 2024
HomeMovie Newsబాలకృష్ణ అన్ స్టాపబుల్ 3.. ఈసారి టాప్ స్టార్స్!

బాలకృష్ణ అన్ స్టాపబుల్ 3.. ఈసారి టాప్ స్టార్స్!

BALAKRISHNA-UNSTOPPABLE-3-WITH-BIG-STARS
BALAKRISHNA-UNSTOPPABLE-3-WITH-BIG-STARS

హైదరాబాద్: బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో, మొదటి రెండు సీజన్లలోనే సంచలనంగా మారింది. ప్రేక్షకులకు వినోదం, ఆసక్తికరమైన సమాచారం అందించే ఈ షో, బాలయ్య స్టైలిష్ హోస్టింగ్ తో మరో లెవెల్‌కి చేరుకుంది.

ఇప్పుడైతే అందరి చూపు సీజన్ 3 పై పడింది. ముందు రెండు సీజన్లు విజయవంతమవడంతో, సీజన్ 3 పై ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది.

ఈ సారి సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథిగా రావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కింగ్ నాగార్జున, ఎన్టీఆర్ కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్వి కూడా గెస్ట్‌లుగా రావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అఖండ 2 షూటింగ్ కు సిద్ధమవుతున్న బాలయ్య, ఈ సీజన్ లో తన హోస్టింగ్ స్కిల్స్ మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

చిరంజీవి కూడా గెస్ట్‌గా పాల్గొనే చాన్స్ ఉందనే ప్రచారం కూడా షోపై అంచనాలు పెంచేస్తోంది. ఏదేమైనా అన్ స్టాపబుల్ 3 ఈ సారి మరింత ఘనంగా ఉండబోతుందనే విషయం మాత్రం ఖాయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular