fbpx
Wednesday, April 24, 2024
HomeMovie Newsబాలకృష్ణ 'నర్తనశాల' ఫస్ట్ లుక్

బాలకృష్ణ ‘నర్తనశాల’ ఫస్ట్ లుక్

Balakrishna FirstLookFrom Nartanashala

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో ‘నర్తనశాల’ అనే సినిమాని అప్పట్లో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 2004 లో మొదలు పెట్టిన ఈ సినిమా అనేక అవాంతరాల వలన ఆగిపోయింది. అప్పుడు షూట్ చేసిన కొన్ని సన్నివేశాల్ని అన్నీ కూర్చి ఒక 17 నిమిషాల నిడివి గల వీడియో గా రూపొందించి ఈ దసరా కానుకగా విడుదల చేస్తున్నారు బాలకృష్ణ గారు. ఈ వీడియో ని శ్రేయాస్ ET ఆప్ ద్వారా విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 24న ఇది డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల అవబోతుంది.

సినిమాకి సంబంధించి బాలకృష్ణ ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల అయింది. అలాగే ఇందులోని మిగతా కొన్ని పాత్రల తాలూకు ఫస్ట్ లుక్స్ రేపు విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. ఈ సినిమాలో అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపతి గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించారు. ఈ సినిమాని శ్రేయాస్ యాప్ లో ఎన్బీకే థియేటర్ లో చూడవచ్చు. టికెట్ ధర మినిమమ్ రూ. 50 పెట్టాలనుకుంటున్నట్టు శ్రేయాస్ అప్ వాళ్ళు తెలిపారు అలాగే టిక్కెట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని బాలకృష్ణ బసవతారకం ట్రస్ట్ కు ఇస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular