దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 విజేతగా ఆస్ట్రేలియా అవతరించింది. దుబాయ్ లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై అధ్బుతంగా పోరాడి గెలిచింది ఆస్ట్రేలియా. న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ను పూర్తిగా అదుపు చేయలేక పోయింది. న్యూజిలాండ్ ఫైనల్లో రికార్డు స్కోరు చేసి ఆస్ట్రేలియాకు కఠినమైన లక్ష్యాన్ని వారి ముందు ఉంచింది. చేధన ప్రారంభించిన కాసేపట్లోనే 15 పరుగులకే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ త్వరగా అవుటయ్యాడు. వెంతనే వచ్చిన మిచెల్ మార్ష్ చాలా దూకుడైన ఆటతో వరుస సిక్సులు ఫోర్ల తో స్కోరు వేగాన్ని అమాంతంగా పెంచాడు.
వార్నర్, మిచెల్ ఇద్దరూ కలిసి బౌండరీలతో ఫైనల్ ఆడుతున్నామనే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఆట కొనసాగించారు. వార్నర్ అవుటయ్యాక వచ్చిన మాక్స్ వెల్ మిచెల్ తో కలిపి లాంచనాన్ని పూర్తి చేశాడు. 7 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియ మ్యాచ్ గెలిచింది. దీంతో ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది.