fbpx
Friday, March 29, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeAndhra Pradeshఏపీ ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి!

ఏపీ ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి!

AP-EAPCET-SCHEDULE-RELEASED

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఈఏపీ సెట్‌ (ఇంతకు ముందు ఎంసెట్) షెడ్యూల్‌ను ఇవాళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఈ సెట్ లో భాగంగా ఇంజనీరింగ్‌ విభాగంలో జూలై 24వ తేదీ నుండి ఆగష్ట్ 8 వరకు అయిదు రోజులపాటు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.

అగ్రికల్చర్‌ విభాగంలో జూలై 11, 12 తేదీలలో ఎంసెట్‌ పరీక్షలు నిర్వహిచనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 11న ఎప్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు తెలిపారు. ఆగష్టులో ఈఏపీ సెట్‌ ఫలితాలు, సెప్టెంబర్‌లో కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

గతంలో 136 సెంటర్లలో నిర్వహించామని, ఈ సారి అవసరమైతే సెంటర్ల సంఖ్య పెంచుతామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. తెలంగాణలోనూ 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటిస్తూ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంటర్ కంటే ముందే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular