fbpx
Monday, December 9, 2024
HomeAndhra Pradeshఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25: సంక్షేమం, అభివృద్ధికి సమతుల్యం

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25: సంక్షేమం, అభివృద్ధికి సమతుల్యం

Andhra Pradesh Budget 2024-25 Highlights – Full Details of Allocations to Various Departments

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 2,94,427.25 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ఆవిష్కరించింది. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తన తొలి బడ్జెట్‌ ప్రసంగాన్ని ముందుకు తెచ్చారు. ఆర్థిక ప్రగతి, సంక్షేమాన్ని సమానంగా ప్రజలకు అందించేందుకు ప్రతిపాదనలు చేయడం ఈ బడ్జెట్‌ లక్ష్యంగా ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916.99 కోట్లు కాగా, మూలధన వ్యయం అంచనా 32,712.84 కోట్లుగా నిర్ణయించారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 4.19 శాతం, ద్రవ్య లోటు 2.12 శాతంగా ఉంచారు.

2023-24 అంచనాలతో పోలిస్తే మార్పులు

2023-24 సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,12,450 కోట్లు, మూలధన వ్యయం 23,330 కోట్లు కాగా, ఆర్థిక లోటు 62,720 కోట్లుగా ఉంది. కొత్త బడ్జెట్‌లో ఈ మొత్తాలను పెంచుతూ, ఆయా రంగాలకు మరింత నిధులను కేటాయించారు.

వివిధ శాఖలకు కేటాయింపులు

  • యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ– రూ. 322 కోట్ల
  • పోలీసు శాఖ– రూ. 8,495 కోట్లు
  • పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ – రూ. 687 కోట్లు
  • రవాణా, రోడ్లు, భవనాల శాఖ– రూ. 9,554 కోట్లు
  • ఇంధన శాఖ – రూ. 8,207 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్య శాఖ– రూ. 3,127 కోట్లు
  • జలవనరుల శాఖ– రూ 16,705 కోట్లు
  • గృహ నిర్మాణ శాఖ– రూ. 4,012 కోట్లు
  • పురపాలక పట్టణాభివృద్ధి శాఖ– రూ. 11,490కోట్లు
  • పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ– రూ. 16,739 కోట్ల
  • వైద్యారోగ్య శాఖ – రూ. 18,421 కోట్లు
  • ఉన్నత విద్యాశాఖ– రూ. 2,326 కోట్లు
  • పాఠశాల విద్యాశాఖ– రూ. 29,909 కోట్లు
  • నైపుణ్యాభివృద్ధి శాఖ– రూ.1,215కోట్లు
  • మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ– రూ. 4,285కోట్లు
  • షెడ్యూల్‌ కులాల సంక్షేమం– రూ. 18,497 కోట్లు
  • షెడ్యూల్ తెగల సంక్షేమం– రూ. 7,557 కోట్లు
  • బీసీల సంక్షేమం – రూ. 39,007కోట్లు
  • అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం– రూ. 4,376కోట్లు
  • వ్యవసాయం, అనుబంధ రంగాలకు– రూ. 11,855 కోట్లు

రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్ళు

పయ్యావుల కేశవ్‌ తన ప్రసంగంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించారు:

  • ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం
  • రుణాలు అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం
  • కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు
  • పిల్లల పౌష్టిక ఆహారం వంటి పథకాలలో నిధుల నిలుపుదల
  • స్థానిక సంస్థల నిధుల మళ్లింపు
  • ఇంధన రంగ సమస్యలు, ఇతర వివిధ రంగాలలో వ్యయాల కుదింపులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular