అమరావతి :ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు రాజధాని అమరావతి రైతులకు శుభవార్త చెప్పారు.
ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో మంత్రి నారయణ పాల్గొన్నారు సమావేశం అనంతరం మంత్రి మీడియాకు వివరాలు తెలిపారు.
రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలు చెల్లించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.
2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం అమరాతి రైతుల నుంచి రాజధాని కోసం 30 వేల ఏకరాల భూమిని సేకరించింది.
అప్పుడు తమ ప్రభుత్వం పదేళ్ల పాటు రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడా పదేళ్ల గడువు పూర్తి కావడంతో, నేడు సీఎం చంద్రబాబు సీఆర్డీఏ సమావేశంలో కౌలు అంశంపై చర్చించారు.
అమరావతి రైతులకు వార్షిక కౌలును మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు.
రైతు కూలీలకు మరో ఐదేళ్ల పాటు పింఛను చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
దీంతో అమారవతి రైతులు హర్షం వ్యక్తం చేసారు.