fbpx
Saturday, April 20, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsఅక్కీ 'బెల్ బాటమ్' టీజర్ విడుదల

అక్కీ ‘బెల్ బాటమ్’ టీజర్ విడుదల

AkshayKumar BellBottom TeaserReleased

బాలీవుడ్: యదార్థ సంఘటనల ఆధారంగా ఇప్పటికీ చాలా సినిమాలు తీసి విజయవంతం చేసిన హీరో అక్షయ్ కుమార్. దాదాపు అయిదు సంవత్సరాలుగా అక్షయ్ కుమార్ చేసిన సినిమాల్లో తొంబై శాతం సినిమాలు అవే ఉంటాయి. ఇపుడు ఇంకోసారి అలాంటి కథ తోనే మన ముందుకు వస్తున్నాడు అక్షయ్ కుమార్. అక్షయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘బెల్ బాటమ్’. ఈ మధ్యనే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా టీజర్ ఇవాల విడుదల అయింది. 1980లో జరిగిన యదార్థ సంఘటలన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ స్కాట్లాండ్ లో ప్లాన్ చేయగా కరోనా కారణంగా ఆగిపోయింది. కరోనా తర్వాత ముందుగా విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రంగా ‘బెల్ బాటమ్’ నిలిచింది. 40 రోజుల ఫారిన్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ ఇండియాకి తిరిగొచ్చింది.

రంజిత్ ఎం తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పూజా ఎంటర్టైన్మెంట్ మరియు ఎమ్మా ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ లో వషూ భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్షికా దేశ్ముఖ్, మోనీషా అద్వానీ,మధు భోజ్వానీ, నిఖిల్ అద్వానీ కలిసి నిర్మించారు.ఈ సినిమాలో అక్షయ్ తో పాటుగా వాణీ కపూర్, హ్యూమా ఖురేషి, లారాదత్తా నటించాడు. అక్షయ్ కుమార్ 80 ల గెటప్ కోసం బెల్ బాటమ్ ప్యాంటు ధరించాడు. టీజర్ లో ఎయిర్ క్రాఫ్ట్ ల మధ్య అక్షయ్ కుమార్ స్టైలిష్ గా నడుచుకుంటూ రావడం అలాగే ఒక కంటైనెర్ ని పట్టుకొని వేలాడుతూ రావడం చూస్తే ఇదొక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్ధం అవుతుంది. ఈ సినిమాని 2021 ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular