మూవీడెస్క్: అక్కినేని అఖిల్ చివరగా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు, కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.
ఈ సినిమా తర్వాత అఖిల్ తదుపరి ప్రాజెక్ట్ గురించి పెద్దగా సమాచారం రాలేదు. ధీర అనే పీరియాడిక్ జోనర్ మూవీలో అఖిల్ వారియర్ పాత్రలో కనిపించబోతున్నాడని, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించబోతోందని పలు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్‌ని మార్చుకొని గెడ్డం పెంచారని కూడా టాక్ వచ్చింది. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావడం లేదు.
ఇక ఇప్పుడు అఖిల్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ గురించి మరో వార్త తెరపైకి వచ్చింది. వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళీకృష్ణ, అఖిల్ కోసం ఒక యాక్షన్ కథ రాశారని, ఈ కథ నాగార్జున, అమల, సుప్రియకు బాగా నచ్చిందని సమాచారం.
ఈ కథ రాయలసీమ నేపథ్యంలో ఉండబోతుందని, టైటిల్ ‘లెనిన్’ అని కూడా టాక్ ఉంది. అఖిల్ కూడా ఈ సినిమా చేయాలని నిర్ణయానికి వచ్చారట.
ఇదే జరిగితే, ధీర కోసం అఖిల్ చేసిన లుక్ వాడతారా లేదా కొత్త లుక్‌ని ప్రెజెంట్ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఏది జరిగినా అఖిల్ తదుపరి సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.