మూవీడెస్క్: బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, దీనికి సీక్వెల్‌గా అఖండ 2 ప్రాజెక్ట్ ప్రారంభమైంది.
ఈ పాన్ ఇండియా చిత్రం దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కబోతోంది.
బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి, రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సీక్వెల్‌లో కూడా బాలకృష్ణ అఘోర పాత్రతో పాటు రైతు పాత్రలో కనిపించనున్నారు.
ప్రగ్యా జైస్వాల్ కూడా కలెక్టర్ పాత్రలో తిరిగి నటించనున్నారు.
ఈ సీక్వెల్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది.
అఖండ అఘోరా రోల్ కాకుండా మరో పాత్రలో బాలయ్య సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
యూఎస్ బ్యాక్‌డ్రాప్‌లో బోయపాటి శ్రీను ఓ భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారు.
ప్రగ్యా జైస్వాల్‌ని కాపాడే సన్నివేశంలో బాలకృష్ణ స్టైలిష్ లుక్‌లో బైక్ పై ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
అంతేకాక, ఈసారి బాలయ్య పాత్రను వ్యవసాయ భూమి, ఎద్దుల బ్యాక్‌డ్రాప్‌కి విరుద్ధంగా స్టైలిష్ అవతార్‌లో పరిచయం చేయనున్నారని టాక్.
ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న అఖండ 2 పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.