fbpx
HomeTop Movie Newsఆడవాళ్ళు మీకు జోహారు, చిత్రం రివ్యూ!

ఆడవాళ్ళు మీకు జోహారు, చిత్రం రివ్యూ!

ADAVALLU-MEEKU-JOHARLU-REVIEW-STANDS-POSITIVE

మూవీ డెస్క్: శర్వానంద్ మరియు రష్మిక జంటగా నటించిన చిత్రం ఆడవాళ్ళూ మీకు జోహర్లు చిత్రం ఇవాళ విడుదలైంది. ఆ చిత్ర రివ్యూ ఇక్కడ మీ కోసం:

టైటిల్‌ : ఆడవాళ్లు మీకు జోహార్లు
నటీనటులు : శర్వానంద్‌, రష్మిక, ఖుష్భూ, రాధిక, ఊర్వసి, వెన్నెల కిషోర్‌, సత్య తదితరులు, నిర్మాణ సంస్థ :శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌, ప్రొడ్యూసర్: ధాకర్​ చెరుకూరి, డైరెక్టర్ : శోర్​ తిరుమల, మ్యూజిక్ : దేవీశ్రీ ప్రసాద్‌, సినిమాటోగ్రఫీ : సుజిత్‌ సారంగ్‌, ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌

యువ కథానయకుడు శర్వానంద్‌ సాలిడ్‌ హిట్‌ కొట్టి చాలా కాలం అవుతుంది. ఈ మధ్యే తీసిన శ్రీకారం, మహాసముంద్రం చిత్రాలు పెద్దగా హిట్ టాక్ సాధించలేదు. అయితే ఈ సారి పక్కా హిట్‌ కొట్టాలనే కసితో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకున్నాడు శర్వానంద్. లేటేస్ట్ టాలీవుడ్ టాప్ భామ రష్మికతో కలిసి కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన చిరంజీవి (శర్వానంద్‌)ఏజ్‌ బార్‌ అయినప్పటికీ పెళ్లి కాదు. తనతో పాటు తన కుటుంబం మొత్తానికి నచ్చే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని చిరు లక్ష్యం. అయితే కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి చూపులకు వెళ్లి వచ్చిన ప్రతి అమ్మాయిని ఏదో ఒక వంక చెప్పి రిజెక్ట్‌ చేస్తారు.

దీంతో తన జీవితంలో ఇక ‘మాంగళ్యం తంతునానేనా ’అనే మంత్రాన్ని ఉచ్చరించనేమోనని బాధపడుతున్న క్రమంలో ఆద్య(రష్మిక) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆద్యకు కూడా చిరుపై ప్రేమ ఉన్నప్పటికీ.. అతని ప్రపోజల్ ను రిజెక్ట్‌ చేస్తుంది. దానికి కారణం తన తల్లి వకుళ(కుష్బూ)కు పెళ్లి అంటే నచ్చకపోవడం.

వకుళను ఒప్పిస్తేనే ఆద్య తనకు దక్కుతుందని భావించిన చిరు.. ఓ చిన్న అబద్దం చెప్పి ఆమెకు దగ్గరవుతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు వకుళకు పెళ్లి అంటే ఎందుకు నచ్చదు? ఆమె నేపథ్యం ఏంటి? చివరకు చిరు, ఆద్యలు ఎలా ఒక్కటయ్యారనేదే మిగతా కథ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular