fbpx
Monday, September 9, 2024
HomeMovie Newsఆయ్.. చిన్న సినిమా బిగ్ సక్సెస్

ఆయ్.. చిన్న సినిమా బిగ్ సక్సెస్

AAY-MOVIE-GOT-SUCCESS-AND-RUNNING-SUCCESSFULLY
AAY-MOVIE-GOT-SUCCESS-AND-RUNNING-SUCCESSFULLY

మూవీడెస్క్: ఈ మధ్య చిన్న సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్నాయి. అందుకు తాజా ఉదాహరణగా నిలిచింది ఆయ్.

నార్నె నితిన్ హీరోగా, అంజిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకున్నా, ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ చేస్తున్నది.

చిన్న బడ్జెట్, సింపుల్ కథ, భారీ వినోదం అన్నీ కలిసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ఆగష్టు 15న గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలోనే మంచి వసూళ్లు రాబట్టింది.

రెండు వారాల రన్‌కు చేరుకునేలోపే వరల్డ్ వైడ్ గా 13.52 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం సినిమాకు కలిసొచ్చింది.

క్రిష్ణాష్టమి సెలవులు కూడా ఈ సినిమా కలెక్షన్లను బాగా పెంచాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడం వల్ల, ఈ చిత్రం ఆడిన స్క్రీన్ సంఖ్య 125 నుంచి 400కి పెరిగింది.

నార్నె నితిన్, ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో టాలీవుడ్‌లోకి వచ్చినా, ఆయ్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మరోవైపు, తెలుగు అమ్మాయి నయన సారిక ఈ చిత్రంలో నాయికగా ఆకట్టుకొని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular