fbpx
Thursday, November 14, 2024
HomeMovie Newsపుష్ప-2 కంటే ముందే రూ.1000 కోట్లు కొట్టబోతున్న బాలీవుడ్ ?

పుష్ప-2 కంటే ముందే రూ.1000 కోట్లు కొట్టబోతున్న బాలీవుడ్ ?

1000-CRORES-MOVIE-FROM-BOLLYWOOD-BEFORE-PUSHPA-2
1000-CRORES-MOVIE-FROM-BOLLYWOOD-BEFORE-PUSHPA-2

మూవీడెస్క్: పుష్ప-2: బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల మార్క్ అందుకోవడం చాలా అరుదు.

ఇప్పటి వరకు దంగల్, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, పఠాన్, జవాన్, కల్కి 2898 ఏడీ మాత్రమే ఈ ఫీట్ సాధించాయి.

ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప-2 కూడా ఈ క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే 2024లో పుష్ప-2 కంటే ముందే రూ.1000 కోట్ల మార్క్ అందుకునే అవకాశమున్న బాలీవుడ్ చిత్రాలు మరో రెండు ఉన్నాయి.

అజయ్ దేవగణ్ సింగమ్ ఎగైన్, కార్తీక్ ఆర్యన్ భూల్ భూలయ్యా-3 పెద్ద వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రాలు భారీ ప్రమోషన్‌తో హైప్ క్రియేట్ చేశాయి, మేకర్స్ విడుదలకు ముందే ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నారు.

ఈ రెండు సినిమాలు మంచి మౌత్ టాక్ అందుకుంటే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడం సాధ్యం అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

మరి ఈ రికార్డు రేసులో పుష్ప-2 ముందు ఎవరు చేరుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular