లక్నౌ: ఇటీవల ఉత్తరప్రదేశ్లో జరిగిన హాథ్రస్ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశిన సిట్ ఇవాళ ఘటనకు సంబంధించి తన విచారణ రిపొర్టును సమర్పించింది. ఈ ఘటనకు ప్రధాన కారణం నిర్వాహకుల నిర్లక్ష్యం అని అలాగే స్థానిక యంత్రాంగం ఉదాసీనతే అని తెలిపింది.
ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం, వాస్తవ సంఖ్యను దాచి కార్యక్రమానికి అనుమతులు తీసుకోవడం మరియు షరతులు పాటించకపోవడం ప్రధాన కరణాలుగా సిట్ తన నివేదికలో పొందుపరచింది.
భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని, కార్యక్రమం అవగానే ప్రజలు బయటకు వెళ్ళడానికి బారికేడ్లు ఏర్పాటు చేయలేదని, ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు పారిపోయారని సిట్ తెలిపింది. స్థానికి పోలీసులు, యంత్రాంగం మరియు సబ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లు ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండానే సత్సంగ్ కు అనుమతులు మంజూరు చేశారని తెలిపింది.
కార్యక్రమానికి 85000 మంది హారజవుతారని అనుమతులు తీసుకోగా 2.5 లక్షల మంది హాజరయ్యారు. ఈ ఘటనలో 121 మంది ప్రాణలు కోల్పోయారు. పోలీశులు ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు.